ముంబైలో భారీ వర్షాలు.. రెడ్ అలర్ట్ జారీ.. 48గంటల్లో భారీ వర్షాలు

మంగళవారం, 4 ఆగస్టు 2020 (11:07 IST)
దేశ ఆర్థిక రాజధాని ముంబైలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో భారత వాతావరణ శాఖ రెడ్‌ అలర్ట్‌ జారీ చేసింది. రానున్న 48 గంటల్లో ఆయా చోట్ల అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. సోమవారం రాత్రి ఎడతెరిపి లేని వర్షం కురవడంతో ముంబైలోని పలుచోట్ల కొండచరియలు విరిగిపడ్డాయి. లోతట్టు ప్రాంతాల్లో వరద నీరు నిలిచి చెరువులను తలపిస్తున్నాయి. 
 
రానున్న 48 గంటల్లో ఇదే రీతిలో వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున టైమ్ ఆఫ్ ఇండియా, సమతా నగర్ పోలీస్ స్టేషన్, హైవే ముంబై, ఉత్తర కొంకణ్ ప్రాంతాల్లో రెడ్‌ అలర్ట్‌ అమల్లో ఉంటుందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) ముంబై డిప్యూటీ డైరెక్టర్ జనరల్ (డీడీజీ) కేఎస్ హోసాలికర్ ట్విట్టర్‌లో పేర్కొన్నారు. వర్షాల కారణంగా పలు రైళ్లను నిలిపివేసినట్లు సెంట్రల్ రైల్వే (సీఆర్) చీఫ్ పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్ శివాజీ సుతార్ తెలిపారు.  
 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు