హెల్మెట్ ధరించకపోవడంతో చనిపోయిన ముఖ్యమంత్రి భార్య!!

శుక్రవారం, 15 ఫిబ్రవరి 2019 (10:58 IST)
రాష్ట్ర హోదా కలిగిన కేంద్రపాలిత ప్రాంతమైన పుదుచ్చేరిలో నిర్బంధ హెల్మెట్ విధానం అమల్లోకి వచ్చింది. ఈ మేరకు ఆ రాష్ట్ర లెఫ్టినెంట్ గవర్నర్ కిరణ్ బేడీ ఉత్తర్వులు జారీచేశారు. పైగా, నిర్బంధ హెల్మెట్‌ విషయంలో ప్రజలకు అవగాహన కల్పించేందుకు ఆమె స్వయంగా రోడ్లపైకి వచ్చి ప్రచారం చేస్తున్నారు.
 
కానీ, ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి నారాయణ స్వామి మాత్రం నిర్బంధ హెల్మెట్ విధానాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం ఉండగా లెఫ్టినెంట్ గవర్నర్ కిరణ్ బేడీ ఇలాంటి ఆదేశాలు జారీ చేయడం ఏమిటని ఆయన ప్రశ్నిస్తున్నారు. ఈ నిర్ణయానికి వ్యతిరేకంగా గత రెండు రోజులుగా రాజ్‌భవన్ ఎదుట నిరసనకు దిగారు. 
 
సీఎం వ్యాఖ్యలు కిరణఅ్ బేడీ కౌంటర్ ఇచ్చారు. ఇదే అంశంపై ఆమె మాట్లాడుతూ, హెల్మెట్ పెట్టుకోకపోవడం వల్లే ముఖ్యమంత్రి వి.నారాయణస్వామి భార్య ప్రాణాలు కోల్పోయారని గుర్తుచేశారు.
 
గతంలో స్కూటర్‌పై వెళ్తూ ప్రమాదానికి గురైన ఆమె తలకు దెబ్బ తగలడంతో మృతి చెందారని వివరించారు. కొన్నేళ్ల క్రితం జరిగిన ఈ ఘటన బాధాకరమైనదేనని ఆవేదన వ్యక్తం చేశారు. తాను రోడ్లపై పడి హెల్మెట్ ధరించాలని చెప్పడం నిరంకుశత్వమని సీఎం వ్యాఖ్యానించడాన్ని బేడీ ఎద్దేవా చేశారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు