పంజాబ్ రాష్ట్రంలో హైఅలెర్ట్ - సీఎం అమరీందర్ ఆదేశాలు
గురువారం, 16 సెప్టెంబరు 2021 (14:30 IST)
పంజాబ్ రాష్ట్రంలో హైఅలెర్ట్ ప్రకటించారు. ఈ రాష్ట్రంలో పాకిస్థాన్ ఐఎస్ఐ మద్దతు ఉన్న ఉగ్రవాదులను అరెస్టు చేశారు. దీంతో పంజాబ్ ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్ ఆ రాష్ట్రంలో హై అలర్ట్ ప్రకటించారు.
పంజాబ్ రాష్ట్రంలోని అమృత్ సర్ జిల్లాలో గత నెలలో జరిగిన పేలుడు జరిగాయి. ఈ పేలుళ్ళలో పాల్గొన్న పాక్ ఐఎస్ఐ మద్దతు ఉన్న నలుగురు ఉగ్రవాదులను అరెస్టు తాజాగా అరెస్టు చేశారు. దీంతో సీఎం అమరీందర్ సింగ్ రాష్ట్రంలో పోలీసుబలగాలను అప్రమత్తం చేశారు.
పంజాబ్ రాష్ట్రంలో ఉగ్రవాదులు శాంతిభద్రతలకు భంగం కలిగించేలా చేస్తున్న ప్రయత్నాలను గమనించిన సీఎం అమరీందర్ సింగ్ హైఅలర్ట్ ప్రకటించారు. రాష్ట్రంలోని మార్కెట్లలో భద్రతను పెంచాలని సీఎం డీజీపీని ఆదేశించారు.