పశ్చిమ బెంగాల్‌లో ఆరెస్సెస్ కార్యకర్తలను, బీజేపీ కార్యకర్తలను క్రూరంగా చంపేస్తే పట్టించుకునే నాథుడే లేడని, ఎలాంటి చర్యలూ తీసుకోవడం లేదని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎప్పుడైతే బీజేపీ అధికారంలో ఉండదో అప్పుడు దేశ ప్రజలు ఇస్లామిక్ తీవ్రవాదం వల్ల ఇబ్బందులకు గురవుతూనే ఉన్నారని ఆయన అన్నారు.
ముస్లింలపై కుటుంబ నియంత్రణ చట్టాలు ఏమాత్రం ప్రభావం చూపవంటూ అస్సాంకి చెందిన ఏఐయూడీఎఫ్ చీఫ్ బద్రుద్దీన్ అజ్మల్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. చట్టంతో పనిలేదని, ముస్లింలు పిల్లల్ని కంటూనే ఉంటారని, వారెవరి మాటా వినరని వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే.