సమాజ్‌వాదీ పార్టీ అధినేత ములాయం సింగ్‌కు ఆయన తనయుడు, ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ గట్టివార్నింగ్ ఇచ్చారు. నాన్నా.. నీ పద్దతేం బోగాలేదంటూ హెచ్చరించారు. ఉత్తరప్రదేశ్ రాష్ట్ర శాసనసభకు వచ్చే యేడాది ఎన్నికలు జరుగనున్నాయి. ఈ ఎన్నికలకు ముందు అధికార ఎస్పీలో లుకలుకలు బహిర్గతమయ్యాయి. ఎన్నికలు ముగిసిన తర్వాతనే సీఎం అభ్యర్థిని ప్రకటిస్తామని చెబుతూ, సొంత కుమారుడు, ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్‌కు పార్టీ సుప్రీమ్ ములాయం సింగ్ యాదవ్ ఝలక్ ఇచ్చారు.
తాజాగా అఖిలేష్ వర్గం ములాయంకు ఓ లేఖ రాస్తూ సంచలన వ్యాఖ్యలు చేసింది. క్రూరులుగా మిగలవద్దని, భవిష్యత్తులో క్షమించలేని తప్పు చేయవద్దని, చరిత్ర ఎవరినీ క్షమించబోదని ఆ లేఖలో పేర్కొన్నారు. పార్టీలోని విభేదాలు, కుటుంబ రాజకీయాలు వెలుగులోకి వస్తుండటం ఆ పార్టీని ఇబ్బంది పెడుతున్నాయని రాజకీయ నిపుణులు వ్యాఖ్యానించారు.