ఉత్తరప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీకి సంపూర్ణ మెజార్టీ వచ్చిందని, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని అయోధ్యలో రామాలయం నిర్మించాలని శివసేన డిమాండ్ చేసింది. ఈ మేరకు భారతీయ జనతా పార్టీని కోరింది.
శనివారం వెల్లడైన యూపీ ఎన్నికల ఫలితాల్లో అంచనాలకు భిన్నంగా ఎవ్వరూ ఊహించని విధంగా బీజేపీ ఏకంగా 325 స్థానాల్లో విజయబావుటా ఎగురవేసిన విషయం తెల్సిందే. ఈ నేపథ్యంలో శివసేన పార్టీ హర్షం వ్యక్తం చేస్తూ, బీజేపీకి అభినందనలు తెలుపుతూ, రామ మందిరం అంశాన్ని మరోసారి తెరపైకి తెచ్చింది.