శవాన్ని మోసుకెళ్లేందుకు వీలుగా నడుముపై నిలబడి వెన్నుపామును విరిచేశారు!

శుక్రవారం, 26 ఆగస్టు 2016 (14:03 IST)
అనారోగ్యంతో ప్రాణాలు కోల్పోయిన భార్యను స్వగ్రామానికి తరలించేందుకు ఆ భర్త భుజాన వేసుకుని 10 కిలోమీటర్ల మేర నడిచిన ఓ భర్త ఘటన ఒడిశాలోని భువనేశ్వర్‌లో చోటుచేసుకుంది. ఈ ఘటన మరవకముందే.. శవాన్ని మోసుకెళ్లేందుకు వీలుగా వెన్నుపామును విరిచిన దారుణమైన ఘటన అదే ఒడిశాలో సంభవించింది.

వివరాల్లోకి వెళితే.. ఒడిశా, బలాసూర్ నుంచి 30 కిలోమీటర్ల దూరంలో ఉన్న సోరో నగరానికి చెందిన సాలామని పారికిన్ (76) అనే విడో మహిళ గత బుధవారం రైలు ఢీ కొనడంతో ప్రాణాలు కోల్పోయింది. 
 
సోరో నగరంలో ఆస్పత్రి లేకపోవడంతో ఆమె మృతదేహాన్ని పోస్టుమార్టమ్ కోసం బలాసూర్‌కు తరలించారు. బలాసూరుకు ఆటోలో మృతదేహాన్ని తరలించేందుకు ఖర్చవుతుంది. కానీ ఖర్చుకు డబ్బుల్లేకపోవడంతో.. పారిశుద్ధ్య కార్మికులు దారుణానికి పాల్పడ్డారు. ఏం చేశారంటే.. పారికిన్ మృతదేహాన్ని నేలపై పడుకోబెట్టి.. నడుముపై నిలబడి వెన్నుపామును రెండుగా విరిచేశారు. 
 
ఆపై పారికన్ మృతదేహాన్ని ప్లాస్టిక్ కవర్లోకి తీసుకున్నారు. తర్వాత పారికన్ మృతదేహాన్ని గోనెసంచిలా మూటగట్టి రెండు కర్రలకు తగిలించి భుజంపై పెట్టుకుని మోసుకెళ్లారు. ఇదంతా ప్రత్యక్షంగా చూసిన పారికిన్ కుమారుడు రబీంద్ర పారిక్ బోరున విలపించాడు. ఈ ఘటనపై ఒడిశా మానవ హక్కుల సంఘం సీరియస్ అయ్యింది. దీనిపై పోలీసులు, బలాసూర్ జిల్లా అధికారుల వద్ద మానవ హక్కుల సంఘం వివరణ కోరింది.

వెబ్దునియా పై చదవండి