దేశ ఆర్థిక రాజధాని ముంబైలో మరోమారు భారీ మొత్తంలో డ్రగ్స్ పట్టబడ్డాయి. 207 కేజీల హై ప్యూరిటీ డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకోగా, వీటి విలువ రూ.1476 కోట్లుగా ఉంటాయని పోలీసులు తెలిపారు. అలాగే, ఈ డ్రగ్స్‌ను దిగుమతి చేసుకున్న దిగుమతిదారుడిని డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (డీఆర్ఐ) అధికారులు అరెస్టు చేశారు. ఈ స్వాధీనం చేసుకున్న డ్రగ్స్ సౌతాఫ్రికా నుంచి వచ్చినట్టు డీఆర్ఐ అధిగారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
నవీ ముంబైలో భారీ మొత్తంలో డ్రగ్స్ చేతులు మారుతున్నట్టు డీఆర్ఐ అధికారులకు సమాచారం వచ్చింది. దీంతో పక్కాగా నిఘా వేసిన అధికారులు... 198 కేజీల హై ప్యూటిరీ క్రిస్టల్ మెథాంఫెటమైన్, 9 కేజీల హై ప్యూరిటీ కొకైన్‌ను గుర్తించి స్వాధీనం చేసుకున్నారు.