ప్రతిరోజూ భారతదేశంలో వేలాది టన్నుల వ్యర్థాలు భూగర్భంతో పాటుగా నదులు, సముద్రాలలో కలిసిపోతుంటాయి. వ్యర్థనిర్వహణ కోసం మెరుగైన పద్ధతులను అనుసరిస్తున్నప్పటికీ, సమ్మిళిత పౌర చర్యల పరంగా చేయాల్సింది మాత్రం ఎంతో ఉంది.
బిన్‌బాయ్ శీర్షికన విడుదల చేసిన ఈ ప్రచారంలో చిన్నారి కథానాయకుడు అప్పు, ప్రజల నడుమ ప్రవర్తనా పరమైన మార్పు రావాల్సిన ఆవశ్యకతను తెలుపుతూనే, ఇల్లు, హౌసింగ్ సొసైటీల వద్దనే వ్యర్థాలను వేరుచేయమని అభ్యర్థిస్తాడు.
హిందుస్తాన్ యునిలీవర్ లిమిటెడ్, ఛైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ సంజీవ్ మెహతా మాట్లాడుతూ, వ్యర్థాలను వేరు చేయడం అంత సులభమేమీ కాదు. హెచ్‌యుఎల్ వద్ద ఈ దిశగా మా వంతు బాధ్యతలను గుర్తించడంతో పాటుగా ఈ రంగంలో సుప్రసిద్ధ సంస్థలు, ప్రభుత్వంతో కలిసి పనిచేస్తున్నాము. స్వచ్ఛత లక్ష్యాల దిశగా పయనిస్తూనే, జీరో వేస్ట్ సర్క్యులర్ ఎకానమీ సృష్టించడానికీ ప్రయత్నిస్తున్నాము. మా తాజా ప్రచారం వ్యర్థ రహిత, ఆహ్లాదకరమైన భవిష్యత్‌ను సృష్టించడంలో ప్రజలను ఏకం చేయగలదని భావిస్తున్నాము అని అన్నారు.