తనకు పెళ్లి కాలేదని చెప్పి మోసం చేసి పెళ్లాడిందని భార్యపైనే ఛీటింగ్ కేసు పెట్టాడో భర్త. గుజరాత్ రాష్ట్రంలోని అహ్మదాబాద్ నగరంలో వెలుగు చూసిన ఈ వివరాలను పరిశీలిస్తే... అహ్మదాబాద్ నగరానికి చెందిన రవి బ్రహ్మభట్ అనే 44 ఏళ్ల వ్యక్తి లేటు వయసులోమ్యారేజ్ బ్యూరో వెబ్‌సైట్ ద్వారా వివరాలు తెలుసుకొని ముంబైకు చెందిన అన్షు అనే యువతిని పెళ్లాడాడు.