ఇంటి దగ్గర సమోసాలు, చట్నీ చేసుకుని రోడ్డు పక్కన పెట్టుకుని వ్యాపారం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. గత శనివారం భార్య చేసిన చట్నీ నచ్చలేదని భర్త ఆమెను తీవ్రంగా కొట్టాడు. దీంతో ఆమె మరణించింది. ఈ ఘటన మధ్యప్రదేశ్‌లో చోటుచేసుకుంది.
దతియా జిల్లా, ఉపరాయణ్ గ్రామంలో ఆనంద్ గుప్తా, ప్రీతి దంపతులు నివసిస్తున్నారు. వీరిద్దరూ గ్రామానికి సమీపంలోని జాతీయ రహదారిపక్కన సమోసాలు అమ్ముతూ ఉంటారు. ఇంటిదగ్గరే సమోసాలు, చట్నీ తయారు చేసుకువచ్చి విక్రయిస్తుంటారు.
రోజు మాదిరిగానే శనివారంకూడా సమోసాలు అమ్మటం మొదలెట్టారు. ఇంతలో ఉదయం తెచ్చిన చట్నీ అయిపోయింది. సమోసాలు మిగిలి ఉన్నాయి. ఇంటికెళ్లి త్వరగా చట్నీ తయారు చేసి తీసుకురమ్మనమని ఆనంద్, భార్య ప్రీతికి చెప్పాడు. ఆమె ఇంటికెళ్లి చట్నీ చేసి తీసుకు వచ్చింది.