నా భర్తను చంపు, కానీ నా పిల్లాడిని వదిలిపెట్టు ఎందుకంటే...?

బుధవారం, 26 జులై 2017 (11:49 IST)
మనుషులు ఆధునికంగా మారుతున్న కొద్దీ బంధాలు సన్నగిల్లుతున్నాయి. సర్వకాల సర్వావస్థలలోనూ కలిసి ఉంటామని అగ్నిసాక్షిగా చేసిన ప్రమాణాలు మంటలలో కలిసిపోతున్నాయి. అక్రమ సంబంధాలు పెరిగిపోతున్నాయి. గతంలో చాటుమాటుగా సాగే ఈ వ్యవహారాలను ఇప్పుడు ఎంతో ధైర్యంగా నడుపుతున్నారు. అడ్డుగా భావిస్తే ఎవరినైనా మట్టు పెట్టడానికి వెనుకాడటం లేదు.
 
సరిగ్గా మూడు నెలల క్రితం ఇలాంటి సంఘటనే గోరఖ్‌పూర్‌లో చోటుచేసుకుంది. 35 ఏళ్ల వివేక్ ప్రతాప్ సింగ్ అనే వ్యక్తి స్థానిక వార్తాపత్రికలో పని చేసేవారు. అతను ఉద్యోగరీత్యా పొద్దున 4 గంటలకు వెళ్లి రాత్రి 10 గంటలకు వచ్చేవాడు. ఈ క్రమంలో అతని భార్య సుష్మా కామేశ్వర్ అనే వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకుంది. తన భర్తను ఎలాగైనా అడ్డు తొలగించాలని భావించిన సుష్మా తన లవర్‌తో కలిసి పన్నాగం పన్నింది. 
 
ఏప్రిల్ 22వ తేదీ ఉదయం కామేశ్వర్ కొంతమంది అనుచరులతో కలిసి వివేక్ ఇంటిలోకి ప్రవేశించి అతని కాళ్లూ చేతులు కట్టేసి ఇటుకలతో మోది చంపారు. ఆ సమయంలో సుష్మా, ఆరేళ్ల కుమారుడు అక్కడే ఉన్నారు. ఆ బిడ్డను కూడా చంపాలని ప్రయత్నించగా వాడు వివేక్‌కి పుట్టలేదు, నీకే పుట్టాడు అని సుష్మా చెప్పగా ఏమీ చేయకుండా వదిలేసారు. తర్వాత కిరాయి మనుషులు శవాన్ని పారవేయడానికి వెళ్లి పోలీసుల కంటపడి భయంతో శవాన్ని కింద పడేసి పరుగులు తీయగా పోలీసులు వారిని వెంబడించి విచారించినప్పుడు ఈ విషయం బయటపడింది.

వెబ్దునియా పై చదవండి