ప్రియుడి కోసం ఓ మహిళ భర్తను చంపేసి నాటకమాడింది. భర్తకు గుండెపోటు వచ్చిందంటూ ఆస్ప్రత్రికి తీసుకెళ్లి జైలు పాలైంది. వివరాల్లోకి వెళితే.. విజయనగరం జిల్లా పనుకువలస గ్రామానికి చెందిన జగదీశ్వర్ రావుకు ఎనిమిదేళ్ల క్రితం జిల్లా కొత్తవలస ప్రాంతానికి చెందిన తులసీతో వివాహమైంది. జగదీశ్వర్-తులసీ దంపతులు ఇద్దరు కుమారులు.
అయితే తులసి భర్తను వదిలించుకోవాలనుకుంది. చీరతో ఉరేసి భర్తను పక్కా ప్లాన్ ప్రకారం చంపేసింది. చివరికి భర్తకు గుండెపోటు వచ్చిందంటూ ఆస్పత్రికి తరలించింది. అయితే వైద్యులు అతనికి గుండెపోటు రాలేదని.. ఎవరో హత్య చేశారని తేల్చేయడంతో పోలీసులు రంగంలోకి దిగారు. తులసి, వీరబాబు విచారణలో నేరాన్ని అంగీకరించడంతో జైలు పాలయ్యారు.