మహిళలను కించపరిచేలా మాట్లాడిన రామ్‌గోపాల్ వర్మ భేషరతుగా క్షమాపణ చెప్పాలని ఎన్‌సీపీ పార్టీ నాయకురాలు, మహారాష్ట్ర ఎమ్మెల్సీ విద్యా చవాన్ డిమాండ్ చేశారు. లేకుంటే ఆయనపై చెప్పుల దాడికి కూడా వెనుకాడబోమని హెచ్చరించారు. కాగా, ఆర్జీవీ గోవా సామాజిక కార్యకర్త ఒకరు కేసు నమోదు చేయగా... మరిన్ని చోట్ల ఆర్జీవీపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
ఇదిలావుండగా, మహిళలంతా సన్నీలియోన్‌లా మగాళ్లకు సంతోషాన్ని అందించాలంటూ చేసిన ట్వీట్‌తో చెలరేగిన వివాదం సద్దుమణగక ముందే వర్మ మరో ట్వీట్ చేశాడు. 'ఉమెన్స్ డే' లాగ 'ఉమెన్స్ నైట్' కూడా ఏదైనా ఉందా? అంటూ మరో ట్వీట్ వదిలాడు. ఈ ట్వీట్ మరింత వివాదాన్ని రాజేస్తోంది.