దేశవ్యాప్తంగా చర్చ జరుగుతున్న ఆర్టికల్ 370పై సుప్రీం కోర్టు కీలక నిర్ణయం వెలువరించింది. ఆర్టికల్ 370 రద్దు నేపథ్యంలో జమ్ము కశ్మీర్ పరిణామాలపై గులాం నబీ ఆజాద్ దాఖలు చేసిన పిటిషన్‌తో పాటు సీతారాం ఏచూరి సహా పలువురు దాఖలు చేసిన పిటిషన్లను చీఫ్ జస్టిస్ రంజన్ గగోయ్ నేతృత్వంలోని ధర్మాసనం విచారించింది.
అలాగే కశ్మీర్ వెళ్లేందుకు పిటిషనర్, కాంగ్రెస్ సీనియర్ నేత గులాం నబీ ఆజాద్‌కు అనుమతి మంజూరు చేశారు.. శ్రీనగర్, అనంత నాగ్, బారాముల్లా, జమ్మూ జిల్లాల్లో పర్యటించేందుకు ధర్మాసనం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అయితే, ర్యాలీలు, స్పీచ్‌లు, ఎలాంటి రాజకీయ కార్యక్రమాలు జరపకూడదని షరతు విధించింది.