విధుల్లో చేరిన అభినందన్ .. అనుచరుల్లో పట్టరాని ఆనందం

ఆదివారం, 5 మే 2019 (11:41 IST)
భారత వైమానికదళ వింగ్ కమాండర్ అభినందన్ వర్ధమాన్‌ తిరిగి విధుల్లో చేరారు. దీనికి సంబంధించిన ఒక వీడియో వైరల్ అవుతోంది. ఇందులో ఆయన తన సహోద్యోగులతో కలిసి మాట్లాడుతూ కనిపిస్తున్నారు. 1.59 నిమిషాల ఈ వీడియోలో అభినందన్‌ను ఆయన అనుచరులు చుట్టుముట్టి అభినందల్లో ముంచెత్తుతున్నారు. అభినందన్‌తో పాటు ఆయన సహోద్యోగులు సెల్ఫీలు తీసుకొంటూ కనిపించారు.
 
వీడియోలో ముందు మీరు కనీసం పది మంది జవాన్లు నిలబడి ఉన్నారు. వాళ్లంతా అభినందన్‌తో సెల్ఫీలు క్లిక్ చేస్తున్నారు. ఈ వీడియోలో అభినందన్ తన సహచరులతో మాట్లాడుతూ కనిపించాడు. 
 
కాగా, ఫిబ్రవరి 27వ తేదీన భారత సరిహద్దుల్లో ప్రవేశించిన పాకిస్థానీ ఎయిర్ ఫోర్స్ విమానాలను వెంటాడే సమయంలో వింగ్ కమాండర్ అభినందన్ ఉన్న మిగ్ 21 విమానం కూలిపోయింది. ఆయన పాకిస్థానీ సరిహద్దుల్లో దిగాల్సి వచ్చింది. అక్కడ సుమారు 60 గంటలు గడిపిన తర్వాత తిరిగి భారత్ వచ్చారు. 
 
అయితే భారత వాయుసేన కాశ్మీర్ లోయలో భద్రతా కారణాల రీత్యా శ్రీనగర్ ఎయిర్ బేస్ నుంచి అభినందన్‌ను బదిలీ చేసింది. ఇప్పుడు అభినందన్ పశ్చిమ క్షేత్రంలో కీలక ఎయిర్ బేస్‌లో విధులు నిర్వర్తిస్తున్నారు.
 

Wing Commander Abhinandan getting clicked. Seems to be a video from Srinagar, before he was posted out. pic.twitter.com/cYbMTAzukT

— Manu Pubby (@manupubby) May 4, 2019

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు