తూరా ప్రాంతంలో క్రిమిహారక మందులు వేయకుండా కూరగాయలు పండించి అమ్ముతుంటారు. నడక ఆరోగ్యానికి మంచిదని, దాంతో పాటు కూరలూ తెచ్చుకోవచ్చని భార్యని తీసుకుని వెళుతుంటారు వారానికి ఒకసారి. పైగా వాటిని తానే స్వయంగా మోసుకొస్తుంటారు.
ప్లాస్టిక్ పర్యావరణానికి హానికరమని వెదురుతో చేసిన బుట్టను వెనుక తగిలించుకుని మార్కెట్‌కు వెళుతుంటారు. ఫిట్ మేఘాలయ, ఫిట్ ఇండియా, ఈట్ ఆర్గానిక్ అనేవి ఆయన సూత్రాలు. గత వారం ఆయన మార్కెట్‌కి వెళ్లి వస్తుంటే ఓ వ్యక్తి ఫొటోలు తీసి ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేయడంతో.. అవి కాస్తా వైరల్ అయ్యాయి.