రాఫెల్ యుద్ధ విమానాలు ఉండివుంటే రఫ్పాడించేవాళ్లం : నరేంద్ర మోడీ

ఆదివారం, 3 మార్చి 2019 (10:12 IST)
ప్రస్తుత పరిస్థితుల్లో మన చేతిలో రాఫెల్ యుద్ధ విమానాలు ఉండివుంటే రఫ్పాడించేవాళ్లమని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వ్యాఖ్యానించారు. ఈ తరహా యుద్ధ విమానాలు భారత్ వద్దలేకపోవడం పెద్ద లోటుగా ఆయన అభివర్ణించారు. 
 
ఢిల్లీలో జరిగిన ఇండియా టుడే కాంక్లేవ్‌లో ప్రధాని నరేంద్ర మోడీ పాల్గొని మాట్లాడుతూ, ప్రస్తుతం మన వద్ద రాఫెల్ యుద్ధ విమానాలు లేకపోవడం పట్ల యావత్ దేశం బాధపడుతుందన్నారు. ఆ విమానాలు మన వద్ద ఉంటే ఫలితం మరోలా ఉండేది. ప్రస్తుతం దేశమంతా ముక్తకంఠంతో మాట్లాడుతున్న మాట ఇదే. రాఫెల్ విమానాల విషయమై గతంలోనూ ఇప్పుడు కొనసాగుతున్న స్వార్థ రాజకీయాల వల్ల దేశం చాలా నష్టపోయిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. 
 
తనను విమర్శించే స్వేచ్ఛ విపక్ష నేతలకు ఉన్నదని, అయితే ఆ విమర్శలు మసూద్ అజర్, హఫీజ్ సయీద్ వంటి ఉగ్రవాదులకు ఉపయోగపడకూడదని మోడీ అన్నారు. కొంత మంది వ్యక్తులు తమ సొంత దేశాన్నే వ్యతిరేకిస్తున్నారు. మన దేశం ముందున్న పెద్ద సవాళ్లలో ఇదొకటి. ఇప్పుడు మన దేశమంతా సాయుధ బలగాలకు అండగా నిలిచింది. కానీ కొన్ని పార్టీలు మన సాయుధ బలగాల శక్తిసామర్థ్యాలను శంకిస్తున్నాయని ఆరోపించారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు