రగిలిపోతున్న పాకిస్థాన్.. సరుకుల్లో విష ప్రయోగం.. జాగ్రత్త అవసరం..

శనివారం, 2 మార్చి 2019 (13:13 IST)
భారత్-పాకిస్థాన్ ఉద్రిక్తత నేపథ్యంలో పాకిస్థాన్ కొత్త ప్లాన్ వేసే అవకాశం వుందని నిఘా వర్గాలు హెచ్చరించాయి. పాకిస్థాన్ నుంచి అభినందన్‌ను అంతర్జాతీయ సమాజం నుంచి ఒత్తిడి తీసుకొచ్చి విడిపించడం.. పాకిస్థాన్‌ను ఏకాకి చేయడంతో ఆ దేశం అంతర్గతంగా రగిలిపోతుంది. ఇందుకు ప్రతీకారంగా జమ్మూకాశ్మీర్‌లో విధులు నిర్వర్తించే జవాన్ల నిత్యావసర సరుకుల్లో విష ప్రయోగం చేయాలని ప్రణాళిక రచించినట్టు ఇంటెలిజెన్స్ వర్గాలు పేర్కొన్నాయి. 
 
ఈ పన్నాగాన్ని పాకిస్థాన్ మిలిటరీ ఇంటెలిజెన్స్, ఐఎస్ఐ పాటుపడే అవకాశం ఉందని.. సరుకులు పంపిణీ చేసే సమయంలో ఒకటికి, రెండుసార్లు చూసుకోవాలని సంబంధిత అధికారులకు స్పష్టం చేసింది. ఇదిలా ఉంటే.. దాయాది పాకిస్థాన్ వైఖరి మారదనేందుకు ఈ ఘటనే నిదర్శనం. పాక్‌లో చిక్కిన పైలట్ అభినందన్‌ను అప్పగించిన కొన్ని గంటల్లోనే సరిహద్దుల్లో తూటాలు పేల్చింది. 
 
దీంతో ముగ్గురు పౌరులు మృతిచెందారు. వీరిని రుబానా కోసర్, ఆమె కుమారుడు సోన ఫజాన్, 9 నెలల నెలల పాప షాబ్నాంగా గుర్తించారు. ఈ కాల్పుల్లో మరొకరు గాయపడినట్టు భద్రతా సిబ్బంది పేర్కొన్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు