మరో 4 రోజులు భారీ వర్షాలే వర్షాలు

బుధవారం, 24 నవంబరు 2021 (08:06 IST)
తమిళనాడు రాష్ట్రంలోతో పాటు ఏపీలోని కొన్ని జిల్లాల్లో మరో నాలుగు రోజుల పాటు విస్తారంగా వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. ఇప్పటికే కుండపోత వర్షాలతో ప్రజలు వణికిపోతున్నారు. ఈ పరిస్థితుల్లో మరో నాలుగు రోజుల పాటు ఈ వర్షాలు కురుస్తాయని ఐఎండీ హెచ్చరించడంతో ప్రభుత్వ యంత్రాంగాలు అప్రమత్తమయ్యాయి. 
 
మరోవైపు, తమిళనాడు రాష్ట్రానికి ఆరెంజ్ హెచ్చరికనుచేసింది. బుధవారం అతిభారీ వర్షం కురిసే అవకాశం ఉందని హెచ్చరిక చేసింది. అలాగే, గురు, శుక్రవారాల్లో కూడా భారీ వర్షం కురుస్తుందని ఐఎండీ తెలిపింది. ఈ నెల 25వ తేదీన బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశాలు ఉన్నాయని పేర్కొంది. 
 
ఇకపోతే, ఈ నెల 25, 26వ తేదీల్లో ఆరెంజ్ అలెర్ట్ జారీచేసింది. బుధవారం కన్యాకుమారి, రామనాథపురం, నెల్లై జిల్లాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తాయని పేర్కొంది. అలాగే, 25న తమిళనాడు కోస్తా జిల్లాల్లో, 26న పుదుచ్చేరి, కారైక్కాల్ తదిత ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది. ఇది రాష్ట్ర ప్రభుత్వం అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేసింది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు