వచ్చే ఐదు రోజులు ఎండలు మండిపోతాయ్.. ఐఎండీ హెచ్చరిక

శుక్రవారం, 24 ఫిబ్రవరి 2023 (09:15 IST)
వచ్చే ఐదు రోజుల పాటు ఎండలు మండిపోతాయని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. ఇప్పటికే ఫిబ్రవరి నెలలో పగటిపూట ఉష్ణోగ్రతలు ఒక్కసారిగా పెరిగిపోయాయి. ఈ ఎండల తీవ్రతతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఈ పరిస్థితుల్లో ఐఎండీ పిడుగులాంటి వార్తను వెల్లడించింది. వచ్చే ఐదు రోజుల పాటు ఎండలు మండిపోతాయని హెచ్చరించింది. వాయువ్య, మధ్య, తూర్పు భారతదేశంలో సాధారణం కంటే 3 నుంచి 5 డిగ్రీలు అధికంగా ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని ఐఎండీ గురువారం తెలిపింది. 
 
దేశంలోని చాలా ప్రాంతాల్లో ఇప్పటికే అధిక ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి. సాధారణంగా ఎండలు మార్చి మొదటి వారంలో ప్రారంభమవుతాయి. కానీ ఈసారి ముందుగానే ఎండలు మొదలయ్యాయని తెలిపింది. దీన్ని బట్టి చూస్తే ఈసారి ఎండలు ఎక్కువగానే ఉండే అవకాశాలున్నాయని హెచ్చరించింది. 
 
అయితే, వచ్చే రెండు రోజుల్లో వాయువ్య భారతదేశంలో గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశాలు లేదని వాతావరణ శాఖ తెలిపింది. ఆ తర్వాత 2 నుంచి 3డిగ్రీల సెల్సియస్‌ వరకు ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఉందని అంచనా వేసింది. మార్చి మొదటి వారంలో వాయువ్య భారతదేశంలోని పలు ప్రాంతాల్లో 40 డిగ్రీల సెల్సియస్ లేదా అంతకంటే ఎక్కువ ఉష్ణోగ్రతలు పెరగవచ్చని వాతావరణశాఖ అధికారులు తెలిపారు

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు