ఉద్యోగం కోసం ఓ మహిళ రోడ్డెక్కింది... నగ్నంగా నిరసన చేపట్టింది..

గురువారం, 23 ఫిబ్రవరి 2023 (12:10 IST)
ఓ నర్సు ఉద్యోగం కోసం రోడ్డుపై నగ్నంగా నిరసన చేపట్టింది. పోస్టింగ్ ఇవ్వడంలో అధికారులు తీవ్ర జాప్యం చేస్తున్నారంటూ ఆమె తీవ్ర ఆవేదన వ్యక్తం చేసింది. దీంతో నగ్నంగా మారి రోడ్డుపై నిరసనకు దిగింది. ఈ ఘటన రాజస్థాన్ రాష్ట్రంలో వెలుగు చూసింది. ఈ వివరాలను పరిశీలిస్తే,
 
ఎస్ఎంఎస్ వైద్య కాలేజీ ఎదుట మహిళ నగ్న ప్రదర్శన చేసింది. అజ్మీర్ జిల్లాకు చెందిన ఈమె జాఎల్ఎం రోడ్డుపై ఆస్పత్రికి ముందు బుధవారం ఈ ఆందోళన చేపట్టింది. ఉదయం 10 గంటలకు ఈ ఘటన జరిగింది. ఆ రోడ్డుపై వెళుతున్న ప్రయాణికులంతా ఆ మహిళను చూసి ఆశ్చర్యం వ్యక్తం చేశారు. కొద్దిసేపటి తర్వాత కొందరు మహిళలు ఆ మహిళ గురించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. 
 
దీంతో హుటాహుటిన అక్కడకు చేరుకున్న పోలీసులు ఆ మహిళను అదుపులోకి తీసుకున్నారు. దుస్తులు వేసుకోవాలని మహిళా కానిస్టేబుళ్లు విజ్ఞప్తి చేసినా ఆమె వినిపించుకోలేదు. ఎంత చెప్పినా దుస్తులు వేసుకునేందుకు నిరాకరించింది. ఇక చేసేది లేక ఆమెను పోలీసులు బలవంతంగా అరెస్టు స్టేషన్‌కు తరలించారు. పోస్టింగ్ ఇవ్వడంలో అధికారులు తీవ్ర జాప్యం చేయడంతో ఆమె ఈ తరహా నిరసనకు దిగారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు