వివరాల్లోకి వెళితే.. అచల్ తండ్రి ముఖేష్ శ్రీమల్ హార్డ్‌వేర్, ఆటోపార్ట్‌లలో పెద్ద వ్యాపారవేత్త. అతనిది సంపన్న కుటుంబం. అచల్ వారి ఏకైక కుమారుడు. కానీ తన తండ్రి ఆస్తిని, కోట్ల వ్యాపారాన్ని వదిలిపెట్టి సన్యాసంలోకి అడుగుపెడుతున్నాడు అచల్. ఇతర పిల్లల్లాగే ఆడుకోవడం, ప్రయాణం చేయడం, మొబైల్ వాడటం అంటే ఇష్టంగా ఉండే అచల్ ఇప్పుడు రిటైర్మెంట్ బాట పట్టాడు.
గత ఏడాదిన్నర కాలంగా అచల్ ఏసీ ఫ్యాన్ల వంటి భౌతిక సౌకర్యాలన్నింటినీ వదులుకున్నాడు. అతను జైన సన్యాసిగా మారాలని ప్రతిజ్ఞ చేసుకునప్పటి నుండి.. రాష్ట్రంలోని అనేక నగరాలు ఇతర రాష్ట్రాలలో ఊరేగింపులు నిర్వహించి అచల్‌కు స్వాగతం పలుకుతున్నారు. డిసెంబరు 4న జైన సన్యాసి జినేంద్ర ముని నాగ్డా గ్రామంలోనే అచల్‌కు దీక్షను ఇస్తారు.