భారత్‌లోని పిల్లల్లో ఇమ్యూనిటీ భేష్‌: ఎయిమ్స్‌ డైరెక్టర్‌ రణ్‌దీప్‌ గులేరియా

మంగళవారం, 20 జులై 2021 (20:38 IST)
దేశవ్యాప్తంగా పాఠశాలలను దశలవారీగా తెరిచే అంశాన్ని పరిశీలించాలని ఢిల్లీ ఎయిమ్స్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ రణ్‌దీప్‌ గులేరియా సూచించారు. మన దేశంలోని పిల్లల్లో రోగ నిరోధక శక్తి బాగుందని చెప్పారు.

కరోనా కట్టడికి గత ఏడాది మార్చిలో దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌ విధించినప్పుడు పాఠశాలలు మూతపడ్డాయి. అప్పటి నుంచి వర్చువల్‌ విధానంలోనే తరగతులు నిర్వహిస్తున్నారు.

గత ఏడాది అక్టోబర్‌లో విడుతలవారీగా పాఠశాలల పునఃప్రారంభానికి కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చినప్పటికీ తర్వాత ఉపసంహరించుకున్నది.

ఈ నేపథ్యంలో పాఠశాలలు తిరిగి తెరిచే సమయం వచ్చిందని గులేరియా అన్నారు. వైరస్‌ వ్యాప్తి తక్కువగా (పాజిటివిటీ రేటు 5 శాతంలోపు) ఉన్న జిల్లాల్లో దశలవారీగా పాఠశాలలను పునఃప్రారంభించాలని చెప్పారు.

పిల్లల్ని రోజు విడిచి రోజు పాఠశాలలకు హాజరయ్యేలా చూడాలన్నారు. వైరస్‌ తీవ్రత మళ్లీ పెరిగితే, పాఠశాలలను వెంటనే మూసివేయవచ్చని తెలిపారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు