కేరళ రాష్ట్రంలోని పాలక్కాడ్‌లో ప్రియుడు, ప్రియురాలు కలిసి ఒకే గదిలో ఉన్నారు. కొన్ని నెలల పాటు ఆ గదిలోనే ఉన్నారు. కానీ, అబ్బాయి తల్లిదండ్రులు గుర్తించలేకపోయారు. ఇక్కడ విచిత్రమేమిటంటే యువతి ఇల్లు కూడా పొరుగిల్లే. ఆ యువతి తల్లిదండ్రులు కూడా ఈ విషయాన్ని పసిగట్టలేకపోయారు. చివరకు తమ కుమారుడు కనిపించడం లేదని అబ్బాయి తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన పోలీసులు... ఆ ప్రేమ జంటను గుర్తించారు. వారు చెప్పిన విషయం విని షాక్‌కు గురయ్యారు.
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, పాలక్కాడ్‌కు చెందిన ఓ యువతి పదేళ్ళ క్రితం తన ప్రియుడితో కలిసి లేచిపోయింది. ఆ యువతి తల్లిదండ్రులు ఎక్కడెక్కడో గాలించారు. చివరకు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయినా ఆచూకీ దొరకలేదు. దీంతో.. ఆశలు వదిలేసుకున్నారు.
ఇన్ని సంవత్సరాలు అక్కడే గడిపింది. అబ్బాయి తల్లిదండ్రులకు కూడా విషయం తెలియనంతగా గోప్యత పాటించారు ఆ ప్రేమికులు. ఆ అబ్బాయి.. తన పక్కింటి ప్రియురాలిని.. ఎవరికీ తెలియకుండా తమ ఇంట్లో.. తన గదిలో ఉంచేశాడు. అన్న పానీయాలు తనే అందించే వాడు. తను గదిలో ఉంటే.. లోపల గడియ పెట్టుకునే వాడు.. లేకపోతే.. బయట తాళం వేసేవాడు.
అయితే, ఆ గదికి అటాచ్డ్ బాత్‌రూమ్ కూడా లేకపోవడంతో ఆ అమ్మాయి రాత్రి వేళ కిటికీ నుంచి బయటకు దూకి బాత్‌రూమ్‌కి వెళ్లేదట! మూడు నెలల క్రితం ఆ అబ్బాయి.. గదిలోని తన ప్రియురాలిని తీసుకుని ఇల్లు వదిలి పారిపోయాడు. అదే ఊళ్లో మరో ఇల్లు అద్దెకు తీసుకుని ఇద్దరూ సహజీవనం చేసేవాళ్లు. ఈ సారి అబ్బాయి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేయగా.. ప్రేమికులిద్దరూ పోలీసులకు పట్టుబడ్డారు.