కోడిగుడ్లకు పెరిగిన గిరాకీ

మంగళవారం, 15 జూన్ 2021 (09:24 IST)
కొవిడ్‌ రెండో దశ ఉద్ధృతి నేపథ్యంలో కోడిగుడ్లకు గిరాకీ విపరీతంగా పెరిగినట్లు ప్రభుత్వ అధికారులు, పరిశ్రమ నిపుణులు వెల్లడించారు. గత జనవరి-ఫిబ్రవరిలో బర్డ్‌ఫ్లూ వ్యాపిస్తోందనే ప్రచారంతో ఒక్కసారిగా గుడ్ల వినియోగాన్ని ప్రజలు తగ్గించారు.

అయితే కొవిడ్‌ మహమ్మారి విజృంభించడంతో, రోగ నిరోధకత పెంచుకునేందుకు మళ్లీ గుడ్ల వినియోగం పెంచారు. ఒకపక్క లాక్‌డౌన్, కర్ఫ్యూ ఆంక్షలు, కార్మికుల కొరత వల్ల సరఫరా ఇబ్బందులున్న ప్రస్తుత సమయంలో గిరాకీ పుంజుకుంది. ఇదే సమయంలో కోళ్ల దాణా వ్యయాలు పెరిగిపోవడంతో గుడ్ల రిటైల్‌ ధరలు ఆయా ప్రాంతాల ఆధారంగా రూ.6-7 వరకు పెరిగాయి.

• కొవిడ్‌-19 రోగులకు అధికంగా ప్రోటీన్లు లభించే ఆహారం అవసరమని వైద్యులు సూచిస్తున్నారు. ప్రతి ఒక్కరికీ తక్కువ ధరలో ప్రోటీన్లు అందేందుకు గుడ్లు సులభ మార్గమని నిపుణులు చెబుతున్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు