భారత భూభాగంలోకి చైనా జవాన్.. ఇవాళ డ్రాంగన్ కంట్రీకి అప్పగింత

సోమవారం, 11 జనవరి 2021 (14:07 IST)
చైనాకు చెందిన జవాన్ భారత భూభాగంలోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. భారత బలగాలు ఆ సైనికుడిని అదుపులోకి తీసుకున్నాయి. ఈ ఏడాది జనవరి 8వ తేదీన పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ(పీఎల్ఏ) సైనికుడు లఢాక్‌లోని ఎల్ఏసీ వద్ద సరిహద్దు దాటి భారత భూభాగంలోకి వచ్చాడు. అలా భారత భూభాగంలోకి వచ్చిన చైనా జవాన్‌ను ఆ దేశ సైన్యానికి ఇండియన్ ఆర్మీ ఇవాళ తిరిగి అప్పగించింది.
 
అంతకుముందు తమ సైనికుడు అదృశ్యమైనట్టు చైనా ఆర్మీ శనివారం ప్రకటించింది. ఆ తర్వాత తమ భూభాగ పరిధిలోకి వచ్చినందున ఆ సైనికుడిని అదుపులోకి తీసుకున్నట్లు ఇండియన్ ఆర్మీ ప్రకటించింది. 
 
మొత్తానికి సోమవారం ఉదయం సరిహద్దులోని చూషుల్ - మోల్దో వద్ద సైనికుడిని చైనా సైన్యానికి భారత బలగాలు అప్పగించాయి. గాల్వన్ ఘర్షణల తర్వాత పీఎల్ఏ సైనికులు భారత భూభాగ పరిధిలోకి రావడం ఇది రెండోసారి. గతేడాది అక్టోబర్‌లో కూడా పీఎల్ఏ సైనికుడు లఢాక్ వద్ద భారత భూభాగంలోకి ప్రవేశించాడు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు