సరిహద్దుల్లో అనునిత్యమూ అప్రమత్తంగా ఉండి కాపలా కాస్తూ, దేశంలోకి ఉగ్రవాదులను చొరబడనీయకుండా చూస్తున్న జవాన్లకు ఈ దీపావళిని అంకితమిద్దామని ప్రధాని నరేంద్ర మోడీ వ్యాఖ్యానించారు. ఆదివారం 'మన్ కీ బాత్'లో భాగంగా ఆల్ ఇండియా రేడియో ద్వారా జాతిని ఉద్దేశించి ప్రసంగించారు.
ఇందులో ఆయన మాట్లాడుతూ నేటి (ఆదివారం) రాత్రి ప్రతి ఇంటా జవాన్ల క్షేమాన్ని తలస్తూ ఓ దీపాన్ని వెలిగించాలని విజ్ఞప్తి చేశారు. దేశ ప్రజలంతా ఐక్యత కోసం కృషి చేయాలని కోరిన ఆయన, నేడు వెలిగించే దీపాలతో చీకట్లన్నీ తొలగిపోవాలని ఆకాంక్షించారు.
ప్రపంచ వ్యాప్తంగా భారతీయులంతా దీపావళి పర్వదినాన్ని ఘనంగా జరుపుకుంటున్నారని, చెడుపై జరిగే పోరాటంలో ఎల్లప్పుడూ మంచే విజయం సాధిస్తుందని అన్నారు. దీపావళి రోజు వెలిగించే దీపాలతో అన్ని రకాల చీకట్లు తొలగిపోవాలి. జవాన్లకు దేశ నలుమూల నుంచి ప్రజలు సందేశాలు పంపారు.