రెబల్ స్టార్ ప్రభాస్ ఈ చిత్రం టీజర్‌ను లాంచ్ చేశారు. టీజర్ విజువల్ వండర్ గా వుంది. లోభం vs త్యాగం, చీకటి vs దైవత్యం మధ్య జరిగే పోరాటంని అద్భుతంగా ఆవిష్కరించారు. ఆకాశమంత ఆరాధన కలిగించేలా శివుని సాక్షాత్కారం టీజర్‌లో స్పిరిచువల్ హైపాయింట్.
టీజర్ మిస్టరీ, పవర్, హై-స్టేక్స్ మైథాలజీతో నిండిన ప్రపంచాన్ని పరిచయం చేసింది. సుధీర్ బాబు ప్రజెన్స్ డివైన్ వైబ్స్ కలిగించింది. త్యాగంతో పుట్టిన రక్షకుడిగా కనిపించిన పాత్రలో ఆయన లుక్ అదిరిపోయింది. సోనాక్షి కలకలం సృష్టించే శక్తిగా కనిపించింది. ఈ మైథాలజికల్ సూపర్‌నేచురల్ థ్రిల్లర్ హై ఆక్టేన్ స్టోరీటెల్లింగ్, మైండ్‌బ్లోయింగ్ విజువల్స్ అదరగొట్టింది.
స్కేల్, మేకింగ్, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, ఎక్జిక్యూషన్ అన్నింట్లోనూ ఈ టీజర్ ఒక అద్భుతమైన మైథాలజికల్ స్పెక్టకిల్ రాబోతుందనే హింట్ ఇచ్చింది. జటాధరలో ఇండియన్ హెరిటేజ్‌ని కటింగ్-ఎడ్జ్ గ్రాఫిక్స్, హై కాన్సెప్ట్ నేరేటివ్‌తో ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని పంచబోతుంది
ప్రతి ఫ్రేమ్‌లోనూ గ్రాండియర్ కనిపించింది. రిచ్ సెట్స్, అద్భుతమైన సినిమాటోగ్రఫీ, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, ఎపిక్ స్టోరీటెల్లింగ్‌తో జటాధర బిగ్ సినిమాటిక్ ఈవెంట్ కానుంది.
జీ స్టూడియోస్, ప్రెర్ణా అరోరా ప్రెజెంట్ చేస్తున్న ఈ సినిమాను ఉమేష్ కుమార్ బన్సాల్, ప్రెర్ణా అరోరా ప్రొడ్యూస్ చేస్తున్నారు. మ్యూజిక్ జీ మ్యూజిక్ కో., క్రియేటివ్ డైరెక్షన్ దివ్య విజయ్. జీ స్టూడియోస్ స్ట్రాటజిక్ విజనరీ ఉమేష్ కుమార్ బన్సాల్ మద్దతుతో, ప్రొడ్యూసర్స్ శివిన్ నారంగ్, నిఖిల్ నందా, అరుుణ అగర్వాల్, శిల్ప సింగాల్, కో-ప్రొడ్యూసర్స్ అక్షయ్ కేజ్రివాల్, కుస్సుం అరోరా ఈ ప్రాజెక్ట్ కు మద్దత్తు ఇస్తున్నారు. టాయిలెట్: ఎక్ ప్రేమ్ కథ, ప్యాడ్‌మాన్, పరి వంటి హిట్స్ ఇచ్చిన ప్రెర్ణా అరోరా మళ్లీ హై-కాన్సెప్ట్ సినిమాను రూపొందిస్తున్నారు.
విజనరీ టీమ్, జానర్ బౌండరీలు చెరిపేసే కాన్సెప్ట్‌తో, జటాధర ఈ ఏడాది మోస్ట్ అవైటెడ్ థియేట్రికల్ రిలీజ్‌లలో ఒకటిగా వస్తోంది. దేశవ్యాప్తంగా థియేట్రికల్ రిలీజ్ ప్లాన్ చేస్తున్న జటాధర ఇండియా సినిమాలో నెక్స్ట్ మైథాలజికల్ ఎపిక్‌గా మారబోతోంది.