లద్దాఖ్‌ సెక్టార్‌లో కే9-వజ్ర.. 47కేజీల బాంబులను పేల్చేస్తుందట!

శనివారం, 2 అక్టోబరు 2021 (18:50 IST)
Vajra
తూర్పు లద్దాఖ్‌లో అధునాతన ఆయుధాలను భారత సైన్యం మోహరిస్తోంది. ఇందులో భాగంగానే లద్దాఖ్‌లోని ఫార్వర్డ్‌ ఏరియాల్లో తొలిసారిగా కే9-వజ్ర శతఘ్నులను మోహరించింది. స్వీయ చోదక సామర్థ్యం గల ఈ కే9 - వజ్ర శతఘ్నులు.. 50 కిలోమీటర్ల పరిధిలో ఉన్న శత్రు స్థావరాలపై విరుచుకుపడి ధ్వంసం చేయగలవు. ఈ హౌవిట్జర్‌లతో కూడిన మొత్తం రెజిమెంట్‌ను వాస్తవాధీన రేఖ వెంబడి లద్దాఖ్‌ సెక్టార్‌లో మోహరించారు. 
 
కే9 వజ్ర హౌవిట్జర్‌ను 2018లో సైన్యంలో ప్రవేశపెట్టారు. ఈ శతఘ్ని 50 టన్నులు బరువు ఉంటుంది. 47కేజీల బాంబులను పేల్చగలదు. ఈ సందర్భంగా ఆర్మీ చీఫ్‌ జనరల్‌ ఎంఎం నరవణె మాట్లాడుతూ ''ఈ శతఘ్నులు అత్యంత ఎత్తయిన ప్రాంతాల్లోనూ పనిచేయగలవని సన్నాహాక పరీక్షల్లో రుజువైంది. ప్రస్తుతం కే9 వజ్ర రెజిమెంట్‌ మొత్తాన్ని ఇక్కడ ఏర్పాటు చేశాం. లద్దాఖ్‌ వంటి సరిహద్దు ప్రాంతాల్లో ఇవి చాలా ఉపయోగకరంగా ఉంటాయి'' అని తెలిపారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు