తొలి అంతర్జాతీయ రైలు సర్వీసును నడుపనున్న భారతీయ రైల్వే

మంగళవారం, 8 ఆగస్టు 2023 (08:35 IST)
రైలు ప్రయాణికులకు ఇదిగో శుభవార్త. భారతదేశం - భూటాన్ మధ్య భారతీయ రైల్వే త్వరలో అంతర్జాతీయ రైలు సేవలను ప్రారంభించనుంది. ఈ విషయాన్ని భారత విదేశాంగ మంత్రి జైశంకర్ తెలిపారు. పొరుగు దేశాల మధ్య రైలు భారతదేశంలోని అస్సాం నుంచి నడుపనున్నట్టు తెలిపారు. భారత్, భూటాన్ దేశాల మధ్య మధ్య పర్యాటకాన్ని మెరుగుపరిచే లక్ష్యంతో ఉంటుందని చెప్పారు. పర్యాటకుల తరలింపు కోసం పాయింట్లను పెంచడానికి భూటాన్ "చాలా ఆసక్తిగా" ఉందని అన్నారు.
 
"భూటాన్, అస్సాం మధ్య రైలు లింక్‌పై మేము చర్చలు జరుపుతున్నాము, ఎందుకంటే పర్యాటకుల కోసం మరిన్ని పాయింట్లను తెరవడానికి భూటాన్ చాలా ఆసక్తిగా ఉంది మరియు ఇది అస్సాంకు చాలా మంచిది." ఇది భారత్, భూటాన్ మధ్య మొట్టమొదటి రైల్వే కనెక్షన్ అవుతుంది. ఈ రైలు 2066 నాటికి అందుబాటులోకి రావొచ్చని భావిస్తున్నట్టు చెప్పారు. 
 
ఈ ఏడాది ఏప్రిల్‌లో, భూటాన్ విదేశాంగ మంత్రి డాక్టర్ టాండి దోర్జీ మాట్లాడుతూ భూటాన్ ప్రభుత్వం మొదట ఈ ప్రాజెక్ట్‌పై పని చేస్తుందని, ఆపై సామ్ట్సే, ఫుయంత్‌షోలింగ్, న్‌గాంగ్లామ్ మరియు సంద్రుప్‌జోంగ్‌ఖార్ వంటి ఇతర ప్రాంతాలను అనుసంధానం చేయాలని చూస్తుందని చెప్పారు.
 
అంతకుముందు, భూటాన్ లైవ్ ఒక నివేదికలో భారతదేశం - భూటాన్ మధ్య రైల్వే లింక్ నిర్మాణాన్ని ప్రారంభించడానికి సర్వే ఏప్రిల్ 2023లో పూర్తయిందని, రైల్వే లింక్ భూటాన్ యొక్క గెలెఫు - భారతదేశంలోని అస్సాంలోని కోక్రాజర్‌లను కలుపుతుందని పేర్కొంది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు