వివాదంలో మళ్లీ చిన్మయి.. నెటిజన్ల ట్రోలింగ్.. కౌంటరిస్తున్న సింగర్

శనివారం, 5 ఆగస్టు 2023 (10:29 IST)
మీటూ ఉద్యమాన్ని దక్షిణాదిన మొదలెట్టిన సింగర్ చిన్మయి శ్రీపాద మళ్లీ ట్రోలింగ్‌కు గురవుతున్నారు. అయినా నెటిజన్లకు ఆమె ధీటుగా సమాధానం ఇస్తున్నారు. ఇండియాను వీడటమే తన కల అంటూ ఓ ఎన్నారై యువతికి మద్దతుగా చిన్మయి ట్వీట్ చేయడం వివాదానికి దారితీసింది. 
 
వివరాల్లోకి వెళితే, కెనడాలో చదువుకుంటున్న ఓ భారతీయ యువతి వీడియో ఇటీవల నెట్టింట్లో వైరల్‌గా మారింది. కెనడాకు ఎందుకు వచ్చారు? అని వీడియోలో ఇంటర్వ్యూవర్ తొలుత ఆమెను ప్రశ్నించారు. ఇండియాను వీడటమే తన డ్రీమ్ అంటూ సంచలన వ్యాఖ్యలు చేసింది. 
 
కెనడాలో స్వేచ్ఛగా వుండవచ్చునని తెలిపింది. ఈ వీడియోపై స్పందించిన చిన్మయి ఆ యువతికి మద్దతుగా నిలిచింది. పరాయిదేశంలో వున్న స్వేచ్ఛ మనదేశంలో లేదని వాపోయింది. ఆమె ఇండియా విడిచి వెళ్లగలిగినందుకు తనకెంతో సంతోషమని చెప్పింది. 
 
ఇక్కడి స్త్రీలందరూ ఇలాగే సురక్షితమైన ప్రదేశాలకు వెళ్లిపోగలిగితే బాగుంటుందని తెలిపింది. మాతృదేశాన్ని కాదనుకున్న యువతికి చిన్మయి మద్దతు ఇవ్వడం అసలేమాత్రం నచ్చని నెటిజన్లు ట్రోలింగ్‌కు దిగారు. ఇందుకు ధీటుగానే చిన్మయి కూడా కౌంటరిస్తోంది. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు