జాబిల్లిపై కాలుమోపి 14 రోజులపాటు పరిశోధనలు చేసి విలువైన సమాచారాన్ని సేకరించిన ఇవి రెండూ చంద్రుడిపై రాత్రి సమయం కావడంతో స్లీపింగ్ మోడ్‌లోకి వెళ్ళిపోయాయి. తిరిగి గత నెల 22న చంద్రుడిపై సూర్యోదయం కావడంతో వాటిని మళ్లీ నిద్రలేపి ప్రయోగాలకు పురమాయించాలని శాస్త్రవేత్తలు భావించారు.