ఆర్ధిక వ్యవస్థలు కోలుకోవడానికి చాలా సమయం: ఆర్‌బిఐ మాజీ గవర్నర్‌

శుక్రవారం, 24 జులై 2020 (07:36 IST)
ఈ ఏడాది చివరి నాటికే కరోనా వ్యాక్సిన్‌ వచ్చినప్పటికీ ప్రపంచ దేశాల ఆర్ధిక వ్యవస్థలు కోలుకోవడానికి మాత్రం చాలా సమయం పడుతుందని ప్రముఖ ఆర్ధికవేత్త, ఆర్‌బిఐ మాజీ గవర్నర్‌ రఘురామ్‌రాజన్‌ పేర్కొన్నారు.

ఆయా దేశాలు కరోనా వైరస్‌ను సమర్ధవంతంగా కట్టడి చేసినప్పటికీ ఆర్ధిక వ్యవస్థలు కోలుకోవడానికి దీర్ఘకాలం పడుతుందని రఘురామ్‌ అన్నారు.

కోట్ల మంది ప్రజలకు వ్యాక్సిన్‌ వేయాల్సి ఉంటుందని, ఇందుకోసం నెలల పాటు సమయం పడుతుందని, ఈలోపుగా వ్యాక్సిన్‌ వేసుకున్న వాళ్లు భద్రతగా భావించే అవకాశం లేదని, వారు బయటికి వచ్చి భారీగా ఖర్చు చేసే అవకాశం లేదన్నారు.

2020 డిసెంబర్‌ నాటికే వ్యాక్సిన్లు వచ్చినప్పటికీ ఆర్ధిక వ్యవస్థలో చలనం రావడానికి 2021 మధ్య కాలం అవుతుందని రాజన్‌ అన్నారు.

భారత్‌ లాంటి దేశాల్లో దీర్ఘకాలం లాక్‌డౌన్‌ కొనసాగిందని, సడలింపులు ఇచ్చినప్పటికీ ప్రజలు బయటకు రావడం లేదని, ఖర్చు పెట్టడం లేదని అందువల్ల ఆర్ధిక వ్యవస్థ తిరిగి పుంజుకోవడం ఆలస్యమౌతోందని అన్నారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు