అది అక్రమ సంబంధం మరణం కాదు, దుష్ప్రచారం ఆపించండి: హైకోర్టుకి తండ్రి పిటీషన్

శుక్రవారం, 5 మార్చి 2021 (20:14 IST)
గత నెల 8వ తేదీన పుణెకి చెందిన యువతి భవనంపై దూకి ఆత్మహత్య చేసుకున్నది. ఈ ఆత్మహత్య వెనుక అక్రమ సంబంధం కారణమనీ, కుటుంబ సభ్యులకు తెలియడంతో ఆమె ఆ దారుణానికి పాల్పడిందంటూ మీడియాలో వార్తలు వచ్చాయి. దీనిపై మృతురాలి తండ్రి కోర్టులో పిటీషన్ వేశారు. తన కుమార్తె మరణం గురించి మీడియాలో తప్పుడు వార్తలు వస్తున్నాయనీ, వీటిని అడ్డుకోవాలని హైకోర్టును ఆశ్రయించారు.
 
పిటీషనర్ తరపున న్యాయవాది వాదిస్తూ... గత నెల 8న బాల్కనీ నుంచి యువతి కిందికి దూకి ఆత్మహత్య చేసుకుంది. దీనిపై ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియాలు తప్పుడు వార్తలను ప్రసారం చేసాయి. వేరే యువకుడితో అక్రమ సంబంధం కారణంగా ఆమె చనిపోయిందంటూ ప్రచారం చేస్తున్నాయి. మృతురాలికి, మరో యువకుడికి మధ్య జరిగిన సంభాషణ అంటూ తప్పుడు వీడియోలు ప్రసారం చేస్తున్నాయి. వీటన్నిటినీ తక్షణమే ఆపించండి'' అంటూ కోర్టుకు విన్నవించారు.
 
వాదనలను విన్న న్యాయమూర్తి, నటుడు సుశాంత్ సింగ్ ఆత్మహత్య కేసులో మీడియా ఎలాంటి నిబంధనలు పాటించిందో అలాంటివే ఈ కేసులో కూడా పాటించాలని ఉత్తర్వులు జారీ చేసింది. బాధితురాలి మరణానికి సంబంధంచి ఎలాంటి వార్తలను ప్రసారం చేయవద్దని సూచించింది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు