రైడ్‌కని వచ్చి సెంచరీ కొట్టామని.. కేక్ కట్ చేశారు.. ఎవరు?

బుధవారం, 15 నవంబరు 2017 (17:54 IST)
అక్రమాస్తుల కేసులో జైలు జీవితం అనుభవిస్తున్న చిన్నమ్మ, శశికళకు ఐటీ షాక్ ఇచ్చింది. తమిళనాడులోని శశికళతో పాటు ఆమె బంధువుల ఇంట ఆదాయపన్ను శాఖ (ఐటీ) అధికారులు సోదాలతో షాకిచ్చారు. వారం పాటు ఈ దాడులు జరిగాయి. పన్ను ఎగవేశారన్న ఆరోపణలతో ఐటీ అధికారులు సోదాలు నిర్వహించారు. జయ టీవీతో పాటు అన్నాడీఎంకే కార్యాయంలోనూ తనిఖీలు చేశారు. 
 
శశికళకు చెందిన కంపెనీలతో పాటు బంధువు ఇళవరసి ఇంట్లోనూ సోదాలు జరిగాయి. టీటీవీ దినకరన్, వివేక్‌ జయరామన్‌, ఇళవరసితో పలువురు ఇళ్లలో ఈ ఐటీ దాడులు జరిగాయి. చెన్నైలోని శశికళ బంధువులు ఇళ్లతో పాటు కొడనాడు ఎస్టేట్, బెంగళూరు, హైదరాబాద్‌, పాండిచ్చేరితో పాటు మొత్తం 187 ప్రాంతాల్లో సోదాలు జరిగినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో ఇళవరసి కుమారుడైన వివేక్ జయరామన్ ఇంట ఐటీ అధికారులు కేక్ కట్ చేసి పండగ చేసుకుంటున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇదేంటి రైడ్‌ కంటూ వెళ్లిన ఇంట ఐటీ అధికారులు కేక్ కట్ చేశారా? అని షాకవుతున్నారు కదూ.. అయితే చదవండి. 
 
శశికళ కుటుంబీకులు, బంధువుల ఇళ్లల్లో ఆపరేషన్ క్లీన్ మనీ పేరిట ఐటీ అధికారులు జరిపిన సోదాల్లో శశికళ కుటుంబీకులు బినామీల పేరిట తీసిన ఆస్తులకు సంబంధించిన పత్రాలు దొరికాయి. ఇందులో ఇళవరసి కుమారుడు వివేక్, కుమార్తె కృష్ణప్రియ ఇళ్లల్లో ఐదు రోజుల పాటు అధికారులు సోదాలు చేశారు. వివేక్ ఇంట్లో రాత్రినక, పగలనక ఐటీ అధికారులు సోదాలు చేశారు. ఆ సమయంలో ''ఇది మాకు వందో రైడ్'' అంటూ ఐటీ అధికారులు వివేక్ ఇంట్లోనే కేక్ కట్ చేసి సెలెబ్రేట్ చేసుకుంటున్నట్లు మీడియాలో వార్తలు వస్తున్నాయి. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు