జార్జ్ సోరోస్‌పై మంత్రి విమర్శలు-వృద్ధుడు, ధనికుడే కాదు.. ప్రమాదకారి

శనివారం, 18 ఫిబ్రవరి 2023 (14:33 IST)
Jaishankar
హిండెన్‌బర్గ్, అదానీ ఉదంతం దేశాన్ని కుదిపేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో భారత దేశంలో ప్రజాస్వామ్య పునరుద్ధరణ జరగవచ్చునని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. 
 
అదానీ గ్రూప్ అప్పులకుప్పగా మారిందని హిండెన్ బర్గ్ నివేదకపై భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఎందుకు మౌనంగా వుంటున్నారని జార్జ్ సోరోస్ ప్రశ్నించారు. భారత పార్లమెంటుకు, విదేశీ ఇన్వెస్టర్లకు మోదీ సమాధానం చెప్పకతప్పదని జార్జ్ అన్నారు.  
 
ఈ వ్యాఖ్యలపై బిలియనీర్ ఇన్వెస్టర్ జార్జ్ సోరోస్‌పై విదేశీ వ్యవహారాల మంత్రి ఎస్. జయశంకర్ తాజాగా మండిపడ్డారు. జార్జ్ సోరోస్.. వృద్ధుడు, ధనికుడే కాకుండా ప్రమాదకారి అంటూ తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు. 
 
దేశంలో జరిగే చర్చను ప్రభావితం చేసేందుకు ఇలాంటి వారు నిధులు మళ్లించవచ్చునని చెప్పుకొచ్చారు. హంగేరీలో పుట్టిన జార్జ్ సోరోస్ ప్రస్తుతం అమెరికాలో వున్నారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు