ప్రస్తుత పరిస్థితుల్లో కొత్త కరోనా వైరస్ కు వ్యాక్సిన్ రావడానికి మరింత సమయం తీసుకుంటుందన్న విషయాన్ని గ్రహించిన జపాన్ ఒక ప్రక్క తమ దేశ ఆర్దిక, పరిపాలనా, మరియు ప్రజల దైనందిన కార్యక్రమాలకు ఎటువంటి ఆటంకం కలగకుండా తగు సురక్షిత చర్యలు పాటిస్తూ కరోనాతో కలిసి జీవించాలని నిర్ణయించుకుంది.
తమ చుట్టూ మరియు మూలల్లో సైతం దాగి ఉన్న వైరస్ నుండి సురక్షిత విధానాలతో పనిచేయడం మరియు జీవించడం నేర్చుకోవాలని తమ ప్రజలకు సూచిస్తూ ఒక "కొత్త లైఫ్ మోడల్" ను ప్రకటించింది, ఈ మోడల్‌ను ఎక్కువ కాలం అనుసరించడానికి సిద్ధంగా ఉండాలని ప్రజలకు పిలుపునిచ్చింది.
ఈ "కొత్త లైఫ్ మోడల్" యొక్క నమూనాలను నిశితంగా పరిశీలిస్తే, జపాన్ ప్రభుత్వం హేతుబద్ధత, విజ్ఞాన శాస్త్రం మరియు వైరస్ యొక్క ప్రమాద అంచనా సూత్రాలను ఉపయోగించి ఈ ఆచరణాత్మక మైన ప్రామాణిక కార్యనిర్వాహక విధానాలను (SOP) ఈ మోడల్ లో ఏర్పాటు చేసిందని గమనించవచ్చు.
బహుశా కొన్ని "చెడు" విషయాలను అన్ని సమయాలలో ఉపేక్షించి వదిలివేయకూడదు అనే జపనీస్ యొక్క అవగాహనకు సంబంధించినది కావచ్చు. వైరస్ పట్ల ఎదురయ్యే వివిధ రకాల ప్రమాద అంచనా లను సూత్రప్రాయంగా ఉపయోగించి, అంచనా వేసి వాటికి సరైన విధానాలు అవలంబించడం ద్వారా మానవులు సురక్షిత జీవనాన్ని కొనసాగించవచ్చు.
జపాన్ తమ ప్రజలకు ప్రవేశ పెట్టిన "కొత్త లైఫ్ మోడల్" లో కేవలం మూడే మూడు ప్రజలు సులువుగా అనుసరించగలిగే ప్రాథమిక అంశాలు ఉన్నాయి . అవి...
1. వ్యక్తుల మధ్య కనీసం 6 అడుగులు లేదా 2 మీటర్ల దూరం పాటించడం.
2. బయటకు వచ్చినప్పుడు సరైన విధంగా మాస్కు ధరించడం.
3. ఎప్పటికప్పుడు చేతులు 20 సెకన్ల పాటు సబ్బు నీరుతో తరచుగా కడగాలి లేదా శానిటైజర్ వాడాలి.
పై వాటితో పాటు కొన్ని నిర్దిష్టమైన ఈ కింది సురక్షిత సూచనలు సైతం చేయడం జరిగినది.
1. బయటకు వచ్చినప్పుడు వ్యక్తుల మధ్య 2 మీటర్ల దూరం పాటించాలి
2. సాధ్యమైనంత వరకు ఉదయం ఆరుబయట ఎండలో ఉండండి.
3. ఇతర వ్యక్తులతో మాట్లాడేటప్పుడు సాధ్యమైనంత వరకూ మీ మొహాలు ఎదురెదురు లేకుండా ఉండటానికి ప్రయత్నించండి.
4. ఇంటికి వెళ్లి వెంటనే మీ ముఖం శుభ్రం చేసుకోవాలి మరియు బట్టలు ఉతుక్కోవాలి.
5. మీరు ఒకరి చేతిని తాకిన వెంటనే సబ్బు నీటితో 20 సేకన్లు కడగాలి లేదా 70%ఆల్కహాల్ గల శానిటైజర్ తో శానిటైజ్ చేసుకోవాలి.
6. ఆన్‌లైన్ షాపింగ్ మరియు ఎలక్ట్రానిక్ పద్దతుల ద్వారా చెల్లింపులు చేయడానికి ప్రయత్నించండి.
7. సూపర్ మార్కెట్ షాపింగ్ కుటుంబం లో 1 వ్యక్తి మాత్రమే నిర్వహించడం ఉత్తమమైనది, మరియు మార్కెట్ లో తక్కువ మంది ఉన్న సమయాన్ని ఎంచుకోవాలి.
8. షాపింగ్ చేసేటప్పుడు ఏదేనా వస్తువుల నమూనాలను తాకకుండా ఉండడానికి ప్రయత్నించండి
9. ప్రజా రవాణా అయిన బస్సు మరియు లోకల్ ట్రైన్లలో ప్రయాణించేటప్పుడు ఇతరులతో అనవసరముగా మాట్లాడకండి.
10. పని మీద బయటకు వెళ్ళేటప్పుడు ఒక్కరే 4 వీలర్, లేదా 2 వీలర్ లేదా కాలినడకన వెళ్ళండి
11. ఎలక్ట్రానిక్ బిజినెస్ కార్డులను ఉపయోగించడం మంచిది
12. వ్యాపారం లేక కార్యాలయ నిమిత్తం సమావేశమైనప్పుడు వీడియో కాన్ఫరెన్స్ ఉపయోగించడానికి ప్రయత్నించండి.
13. సమావేశాలలో పాల్గొనే వ్యక్తుల సంఖ్యను తగ్గించుకోండి, అలాంటి సందర్బాల్లో మాస్కులు వెంటిలేషన్ కోసం సమావేశ మందిరం కిటికీలు తెరచి ఉంచండి..
14. ఇంట్లో ఉండి పని చేయండి లేదా లేటు సమయంలో ప్రయాణించండి
15. వైరస్ ప్రభావితం ఉన్న స్థానికంగా దేశాలకు లేదా ప్రదేశాలకు వెళ్ళకండి.
16. బంధువులను సందర్శించడం మరియు ప్రయాణాలను మానుకోండి. మరియు వ్యాపార ప్రయాణాలను నియంత్రించండి.
17. మీకు వైరస్ లక్షణాలు ఉన్నప్పుడు, మీరు ఎక్కడికి వెళ్లారో, ఎవరిని కలుసుకున్నా రో గుర్తుంచుకోండి.
18. ఇతరులతో భోజనం చేసేటప్పుడు ముఖాముఖి కాకుండా పక్కపక్కనే కూర్చుని చేయడానికి ప్రాధాన్యత ఇవ్వండి.
19. పెద్ద గిన్నెలు మరియు పెద్ద కుండలలో ఉన్న ఆహారాన్ని పంచుకోవడానికి విముఖత చూపండి. విభజించబడిన వ్యక్తిగత భాగం వ్యవస్థను అమలు చేయండి
20. భోజనం చేసే సందర్భం లో తక్కువ మాట్లాడండి, ఎక్కువ కూరగాయలు తినండి
21. భోజనం వద్ద వీలైనంత తక్కువ మంది సమావేశమయ్యేలా ప్రయత్నించండి
22. "ఇరుకు ప్రదేశాలు, గుంపులుగా చేరిన ప్రదేశాలు, బయట వ్యక్తులతో సన్నిహితంగా ఉండడం మానుకోండి.
23. ఆరోగ్య నిర్వహణను బలోపేతం చేయడానికి ప్రతి ఉదయం శరీర ఉష్ణోగ్రత మరియు వైరస్ లక్షణాల స్వీయ పరీక్ష నిర్వహించుకోవాలి.
24. టాయిలెట్ ను ఫ్లష్ చేసేటప్పుడు దాని మూత కప్పండి
25. ఇరుకైన ప్రదేశంలో ఎక్కువసేపు ఉండకండి
26. నడుస్తున్నప్పుడు మరియు నడుస్తున్నప్పుడు, వ్యక్తుల సంఖ్య తక్కువగా ఉండాలి. లేకపోతే ఇద్దరి మధ్య దూరాన్ని అస్థిరం చేస్తుంది.
జపాన్ ప్రభుత్వ కమిటీ చైర్మన్ షిగెరు ఓ మాట్లాడుతూ, వ్యాక్సిన్ పూర్తిగా అభివృద్ధి చెందడానికి మరియు అధికారికంగా ఉపయోగంలోకి రావడానికి కొంత కాలము పడుతుంది. శత్రువును పూర్తిగా తొలగించలేము కాబట్టి, వైరస్‌తో కలిసి జీవించడం నేర్చుకోవాలి. సురక్షిత నియమాలను పాటించడం ద్వారా మాత్రమే మనం కరోనా వైరస్‌తో ఎక్కువ కాలం శాంతియుతంగా జీవించగలం.
వాస్తవానికి, పై పద్ధతులు చాలావరకు చైనాలో అమలు చేయబడ్డాయి. కరోన కలిగిస్తున్న నష్టాన్ని చూసి చాలా మంది భారతీయులు తమ ప్రవర్తనను కూడా మార్చుకున్నారు.
ఇది దీర్ఘకాలిక యుద్ధం అని అందరూ అర్థం చేసుకుంటున్నారు. జన్యుపరంగా జపనీయులు చాలా క్రమశిక్షణ కలిగిన దేశం మరియు వారు కష్టపడి పనులు చేస్తారు మరియు ప్రభుత్వం సూచించిన సూచనలను కఠినంగా పాటిస్తారు.
అందువలన నే కరోన ఆ దేశాన్ని అంతగా ప్రభావితం చేయలేకపోయింది. కరోనాని ఎదుర్కోవాలంటే జపనీయులు తీసుకుంటున్న జాగ్రత్తలు మన జీవన విధానంలో భాగం అయితే బాగుంటుంది.