అమ్మో.. అంత డబ్బా.. భారీ నగలు.. చీరలు, గడియారాలు బాగానే కూడబెట్టారుగా

గురువారం, 16 ఫిబ్రవరి 2017 (11:15 IST)
దివంగత సీఎం జయలలిత.. ఆమె నెచ్చెలి శశికళ భారీ విలువ చేసే నగలను కూడబెట్టుకున్నారు. సుప్రీం కోర్టు అంచనాల ప్రకారం... అక్రమాస్తుల కేసులో జయలలిత, ఆమె నెచ్చెలి శశికళకు సుమారు 2.51 కోట్ల రూపాయల విలువైన బంగారు ఆభరణాలున్నట్లు తేలింది. వీటితో పాటు, 15.9లక్షల రూపాయల విలువైన చేతి గడియారాలు ఉన్నాయని సుప్రీం కోర్టు తన తీర్పులో వెలువరించింది. 
 
జయలలిత మరణించిన తర్వాత తీర్పు రావటంతో ఆమెపై అన్ని ప్రొసీడింగ్‌లను నిలుపుదల చేస్తూ శశికళతో పాటు మరో ఇద్దరు నిందితుల శిక్షను ఖరారు చేసిన తరువాత ట్రయల్ కోర్టు ఇచ్చిన తీర్పును ధ్రువీకరించింది. నిందితుల బ్యాంకు ఖాతాల్లో రూ.97.47లక్షలు మరో 3.42కోట్ల రూపాయల విలువైన ఫిక్స్‌డ్ డిపాజిట్లు ఉన్నట్లు తీర్పులో పేర్కొంది. నిందితులు పలు కంపెనీల్లోకి డబ్బులు తరలించినట్లు తీర్పులో వెల్లడించారు.
 
మాజీ ముఖ్యమంత్రి జయలలితకు సొంతమైన 389 పాదరక్షలు, 914 పట్టుచీరలు, 6,195 ఇతర చీరలు, 2,140 పాత చీరలు, 98 చేతి గడియారాలు, భారీ విలువ చేసే బంగారు ఆభరణాలున్నాయి. 

వెబ్దునియా పై చదవండి