తమిళనాడు ముఖ్యమంత్రి దివంగత జయలలిత మృతిపై ఆ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన నిజ నిర్ధారణ కమిషన్ ఎదుట జయ మేనకోడలు దీపా జయకుమార్ హాజరై సాక్ష్యం చెప్పారు. తన అత్తపై దాడి చేసి ఉంటారంటూ ఆమె సంచలన ఆరోపణలు చేశారు.
జయ మృతిపై వేసిన నిజనిర్ధారణ కమిటీ ఎదుట ఆమె గురువారం హాజరై తన వాదనను వినిపించారు. తన మేనత్త జయలలిత అస్వస్థతకు గురయ్యే అవకాశమే లేదని, ఆమెపై ఖచ్చితంగా దాడి జరిగి ఉంటుందన్నారు.
అపోలో ఆస్పత్రిలో చేరడానికి ముందు రోజు రాత్రి 9 గంటల వరకు జయ చురుగ్గా పనిచేశారని, అంతలోనే ఒక్కసారిగా ఎలా అస్వస్థతకు గురవుతారని ప్రశ్నించారు. ఆమెపై దాడి జరిగి ఉండవచ్చని అనుమానం వ్యక్తం చేశారు.
గతత 2015 సెప్టెంబరు 22న అపోలో ఆసుపత్రిలో చేరకముందు జయ ఆరోగ్యంగానే ఉన్నారన్నారు. అందువల్ల జయలలిత మృతి కేసులో శశికళ, ఆమె కుటుంబ సభ్యులను కూడా విచారిస్తే వాస్తవాలు వెలుగు చూస్తాయన్నారు.