తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, అన్నాడీఎంకే శాశ్వత ప్రధాన కార్యదర్శి జయలలితని అపరాధిగా పేర్కొనలేమని మద్రాసు హైకోర్టు స్పష్టంచేసింది. చెన్నై మెరీనా తీరంలో జయలలితకు స్మారక మందిరాన్ని నిర్మించడాన్ని సవాల్ చేస్తూ హైకోర్టులో ఒక పిటిషన్ దాఖలైంది. జయలలిత మెమోరియల్ కోసం ప్రజల సొమ్మును ప్రభుత్వం ఖర్చు చేస్తుందన్నారు. దేశీయ మక్కల్ కట్చి అధ్యక్షుడు ఎంఎల్ రవి దాఖలు చేశారు.
అక్రమాస్తుల కేసులో జయలలిత ఇప్పటికే దోషిగా ఉన్నారని, కాబట్టి ఆమె మెమోరియల్ కోసం ప్రభుత్వం ఇప్పటికే ఖర్చు చేసి ఉంటే దానిని వెనక్కి తీసుకోవాలని కోరారు. ఈ పిటిషన్‌ను విచారణకు స్వీకరించిన కోర్టు జస్టిస్ ఎం.సత్యనారాయణ్, పి.రాజమాణిక్యంలతో కూడిన డివిజన్ బెంచ్.. అక్రమాస్తుల కేసులో జయలలితపై సుప్రీంకోర్టు తీర్పు వెల్లడించడానికి ముందే ఆమె కన్నుమూశారని, అందువల్ల ఆమె అపరాధి కాదంటూ పేర్కొంటూ పిటిషన్‌ను ధర్మాసనం కొట్టివేసింది.