జేఈఈ మెయిన్ కీ ఫలితాల్లో హైదరాబాద్ కుర్రోడికి సత్తా

మంగళవారం, 25 ఏప్రియల్ 2023 (10:25 IST)
జేఈఈ మెయిన్ చివరి విడత పరీక్షా ఫలితాలకు సంబంధించిన తుది కీని జాతీయ పరీక్షల సంస్థ (ఎన్.టి.ఏ) సోమవారం రాత్రి విడుదల చేసింది. ఈ నెల 6వ తేదీ నుంచి 13వ తేదీ వరకు బీటెక్ సీట్లకోసం పేపర్ 1 పరీక్ష నిర్వహించింది. ప్రాథమిక కీని కొద్ది రోజుల క్రితం విడుదల చేసిన ఎన్టీఏ దానిపై అభ్యంతరాలను స్వీకరించింది. ఈ క్రమంలో సోమవారం తుది కీని విడుదల చేసింది. 
 
వీటిలో హైదరాబాద్ నగరానికి చెందిన సింగరాజు వెంకట్ కౌండిల్య 300కి 300 మార్కులు సాధించాడు. దీంతో ఆ విద్యార్థికి ర్యాంకు టాప్ - 10లో దక్కే అవకాశం ఉంది. కౌండిల్య పాఠశాల విద్య నుంచి ఇంటర్ వరకు హైదరాబాద్ నగరంలోని శ్రీ చైతన్య విద్యా సంస్థల్లో విద్యాభ్యాసం చేశాడు. జూన్ నాలుగో తేదీన జరిగే జేఈఈ అడ్వాన్స్‌ పరీక్షల్లో ఉత్తర ర్యాంకు సాధించి ఐఐటీ బాంబేలో కంప్యూటర్ సైన్స్ చదువుతానని కౌండిల్య విశ్వాసం వ్యక్తం చేశాడు. 
 
మరోవైపు, జేఈఈ అడ్వాన్స్ పరీక్షల కోసం ఈ నెల 30వ తేదీ నుంచి రిజిస్ట్రేషన్ ప్రారంభంకానుంది. ఈ పరీక్షలకు హాజరయ్యేందుకు కటాఫ్ మార్కులను నిర్ణయించింది. ఈ పరీక్ష రాసేందుకు దేశ వ్యాప్తంగా కేవలం 2.50 లక్షల మంది విద్యార్థులు మాత్రమే ఈ పరీక్ష రాసేందుకు అర్హులుగా తేలారు. వీరంతా ఈ నెల 30వ తేదీ నుంచి రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంది. తుది గడువును మే 7వ తేదీగా ఖరారు చేశారు. జూన్ 4వ తేదీన ఈ పరీక్షలు జరుగుతాయి. జూన్ 18న ఫలితాలను వెల్లడిస్తారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు