జార్ఖండ్ రాష్ట్రంలో ఓ దారుణం జరిగింది. భారతీయ జనతా పార్టీ నేత కుమార్తె దారుణ హత్యకు గురైంది. ఆమె రెండు కళ్లు పీకేసి, చెట్టుకు ఉరివేసి హత్య చేశారు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే,
ఈమెను కొందరు వ్యక్తులు అత్యంత పాశవికంగా హత్య చేశారు. కనుగుడ్లు పీకేసి, చిత్రహింసలకు గురిచేసి ఆపై.. చెట్టుకు ఉరివేసి చంపేశారు. ఈ అమానుష ఘటన జార్ఖండ్‌లో పలాము జిల్లా లాలిమతి అడవి ప్రాంతంలో వెలుగు చూసింది.
దుండగులు బాలికను అత్యంత కిరాతకంగా కొట్టి చంపినట్లు ఆమె శరీరంపై ఉన్న గాయాలు స్పష్టం చేస్తున్నాయి. అయితే, తమ కూతురుని అత్యాచారం చేసి చంపేశారని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఇదిలాఉంటే బాలిక మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ప్రభుత్వాస్పత్రికి తరలించారు.