అసదుద్దీన్‌ ఓవైసీకి ఎదురుదెబ్బ.. జమీరుల్‌ హసన్‌ పార్టీకి బైబై

శనివారం, 20 మార్చి 2021 (11:17 IST)
పశ్చిమ బెంగాల్‌లో 294 అసెంబ్లీ స్థానాలకు మార్చి 27వ తేదీ నుంచి ఎనిమిది దశల్లో ఎన్నికలు జరుగనున్నాయి. చివరి దశ ఎన్నికలో ఏప్రిల్‌ 29న జరుగనుండగా.. ఓట్ల లెక్కింపు మే 2న జరుగుతోంది. అధికార తృణమూల్‌ కాంగ్రెస్‌, కాంగ్రెస్‌ -వామపక్షాలు, బీజేపీ మధ్య ఈసారి పోటీ ఉంటుందని రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు. పశ్చిమ బెంగాల్‌లో ఏఐఎంఐఎం పార్టీకి బలముంది. 
 
కానీ ఎన్నికలకు ముందే ఏఐఎంఐఎం అధినేత అసదుద్దీన్‌ ఓవైసీకి ఎదురుదెబ్బ తగిలింది. ఆ పార్టీ బెంగాల్‌ చీఫ్‌ జమీరుల్‌ హసన్‌ పార్టీ నుంచి తప్పుకున్నారు. ఆయన ఇండియన్‌ నేషనల్‌ లీగ్‌ పార్టీలో చేరనున్నట్లు తెలుస్తోంది. ఈ సందర్భంగా జమీరుల్‌ మీడియాతో మాట్లాడుతూ బెంగాల్‌ 95శాతం మంది కార్యకర్తలు తనతోనే ఉన్నారన్నారు. బీజేపీ కోసం పని చేసేందుకే అసద్‌ బెంగాల్‌కు వచ్చారని, అందుకే అబ్బాస్‌ సిద్దిఖీతో సమావేశమయ్యారని ఆరోపించారు.
 
నందిగ్రామ్‌లో బెంగాల్‌ సీఎం మమతా బెనర్జీకి, రాష్ట్రవ్యాప్తంగా బీజేపీకి వ్యతిరేకంగా బలమైన పోటీదారులందరికీ మద్దతు ఇస్తామని పేర్కొన్నారు. నందిగ్రామ్‌లో మమతా బెనర్జీకి మద్దతు ఇస్తున్నామని, తద్వారా సువేందు అధికారి గెలవలేరన్నారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు