అసెంబ్లీ ఎన్నికలు.. ఎంజీఆర్ స్థానం నుంచి కమల్ హాసన్ పోటీ.. కలిసొస్తుందా?

బుధవారం, 3 మార్చి 2021 (15:17 IST)
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో మక్కల్ నీధి మయ్యం చీఫ్ కమల్ హాసన్ పోటీ చేసే స్థానంపై ఓ క్లారిటీ వచ్చింది. గతంలో ఎంజీఆర్ పోటీ చేసిన చెన్నైలోని అలందూర్ స్థానం నుంచి కమల్ హాసన్ పోటీ చేసే అవకాశాలు ఉన్నాయి. ఏప్రిల్ ఆరవ తేదీన తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఆ ఎన్నికల కోసం ఇవాళ కమల్ రెండవ దశ ప్రచారం మొదలుపెట్టనున్నారు. 
 
మంగళవారం ఆయన కోవిడ్ టీకా తీసుకున్న విషయం తెలిసిందే. చెన్నైలోని అలందూర్ స్థానాన్ని కమల్ ఎన్నుకోవడానికి కొన్ని కారణాలున్నాయి. 1967 నుంచి 1976వరకు ఈ స్థానం ఎంజీఆర్ ఆధీనంలో ఉంది. అప్పట్లో ఈ స్థానాన్ని పరంగిమలై నియోజకవర్గంగా పిలిచేవారు. 
 
కమల్ ముందు నుంచీ తన ప్రచారంలో ఎంజీఆర్ అభిమానుల్ని ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. గత లోక్‌సభ ఎన్నికల్లో కమల్ పార్టీకి పట్టణ ప్రాంతాల్లో దాదాపు పది శాతం ఓట్లు పోలయ్యాయి. మార్చి ఏడో తేదీన మక్కల్ నీధి మయ్యం పార్టీ తొలి జాబితాను రిలీజ్ చేయనుంది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు