కోలీవుడ్ సినిమా ఇండస్ట్రీపై ఒకవైపు సుచీ లీక్స్ రూపంలో కుదుపులకు గురి చేస్తుంటే ఇటువపై మన టాలీవుడ్ ఇండస్ట్రీలో హీరోయిన్లు హీరోలపై ఆరోపణలు చేస్తున్నారు. తనను పడక గదికి రప్పించుకునేందుకు ఓ టాప్ హీరో విశ్వ ప్రయత్నం చేశాడంటూ ఓ హీరోయిన్ చేసిన ఆరోపణ టాలీవుడ్ ఇండస్ట్రీలో దుమారం రేపుతోంది. పోయిన వారం హీరోయిన్ మాధవీలత కూడా ఇలాంటి కామెంట్లే చేసింది. తను నోరు విప్పితే ఎంతోమంది కాపురాలు కూలుతాయ్ అంటూ వ్యాఖ్యానించారు.
ఇదిలావుంటే తాజాగా కన్నడ సినీ ఇండస్ట్రీలో ఓ నిర్మాత కామాంధుడుగా మారాడు. తన ఆఫీసులో పని చేస్తున్న ఓ ఉద్యోగినిపై లైంగిక వేధింపులు చేశాడు. ఆఫీసులో వుంటే కేవలం నెలసరి చాలీచాలని జీతంతో జీవితం వెళ్లదీసే బతుకెందుకు... తనకు సహకరిస్తే హీరోయిన్ చేస్తాననీ, అందుకు తనకు సహకరిస్తే ఆ పని చేసేస్తానంటూ ఆమెపై వేధింపులకు దిగాడు. దీనితో బాధిత యువతి విషయాన్ని తన పేరెంట్స్ దృష్టికి తీసుకెళ్లింది. పట్టలేని ఆగ్రహంతో ఆమె పేరెంట్స్ నిర్మాతను చితకబాదారు. పోలీసులకు పట్టించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.