నేను వ్రతంలో వున్నా, నువ్వు తాకితే చచ్చిపోతాం, తీరా చూస్తే 'గే'

శనివారం, 19 సెప్టెంబరు 2020 (14:05 IST)
ఒక వివాహిత ఆవేదన. ప్రేమించి పెళ్ళి చేసుకుంది. పెళ్ళయి సంవత్సరం అవుతోంది. భర్త సంసారం చేయలేదు. దగ్గరికి వెళితే తప్పించుకుని తిరుగుతున్నాడు. అతడి మొబైల్ కూడా చూపించకుండా జాగ్రత్తగా పాస్ వర్డ్ పెట్టుకున్నాడు. ఎలాగోలా ఓపెన్ చేసి చూసిన భార్య షాకైంది. ఇంతకీ ఏం జరిగింది?
 
గుజరాత్ లోని గాంధీనగర్‌లో ఒక వివాహిత తన భర్తపై ఫిర్యాదు చేసింది. ఫిర్యాదు తీసుకున్న పోలీసులే షాక్‌కు గురయ్యారు. ప్రేమించిన పెళ్ళి చేసుకున్న భర్త గే కావడంతో పాటు ఆ విషయం తనకు తెలిసిపోయిందని చిత్రహింసలు పెట్టాడట. 
 
అంతేకాదు తన స్నేహితులను ఇంటికి పిలిపించుకుని శారీరక కోర్కెలు తన ముందే తీర్చుకుంటున్నాడట. దీంతో ఆ వివాహిత, భర్త టార్చర్ తట్టుకోలేక పోలీసులను ఆశ్రయించింది. సంవత్సరం పాటు ఎందుకు నీకు అనుమానం రాలేదని పోలీసులు ప్రశ్నిస్తే తను వ్రతంలో ఉన్నానని, సంవత్సరం వరకు సంసారం వద్దని తనతో భర్త చెప్పినట్లు చెప్పుకొచ్చింది భార్య.
 
అంతేకాదు తనకు దోషం ఉందని పెళ్ళయి సంవత్సరం లోపు కలిస్తే భార్యాభర్తలిద్దరిలో ఎవరో ఒకరు  చనిపోతారని చెప్పాడట. భర్త ఎంతో ఆప్యాయంగా చూసుకుంటూ ఉండటంతో అది నిజమని ఆమె నమ్మేసింది. కానీ సంవత్సరం దాటడంతో పాటు అతనిలో మార్పులు కనిపిస్తుండటంతో తనకు అనుమానం వచ్చిందని.. అసలు విషయం ఆ తరువాత తెలిసిందని బాధితురాలు లబోదిబోమంటోంది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు