ఆవు పేడను దొంగిలించిన ప్రభుత్వ ఉద్యోగి అరెస్ట్

బుధవారం, 6 ఫిబ్రవరి 2019 (14:31 IST)
సాధారణంగా ఆవు పేడను వ్యవసాయానికి, ఆయుర్వేదంలో విరివిగా ఉపయోగిస్తుంటారు. ఇప్పటికీ ఆవు పేడకు ఇప్పటికీ డిమాండ్ ఉంది. అయితే ఓ ప్రభుత్వ ఉద్యోగి ఆవు పేడను దొంగిలించాడు. వివరాల్లోకెళితే, కర్ణాటక బీరూర్ జిల్లాలో పశు సంరక్షణ విభాగానికి చెందిన ఆవు పేడ చోరీకి గురైంది. దాదాపు రూ.1.25 లక్షలు విలువ చేసే ఆవు పేడ చోరీకి గురైనట్టు బీరూర్ పోలీసులకు ఫిర్యాదు అందింది. 
 
పశు సంరక్షణ విభాగం డైరెక్టర్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అమృత్ మహల్ కవల్ స్టాక్‌లో నిల్వ ఉంచిన 35 నుంచి 40 ట్రాక్టర్ల ఆవు పేడను పశు సంరక్షణ విభాగంలో పని చేస్తున్న సూపర్‌వైజర్ దొంగిలించినట్లు పోలీసుల విచారణలో బయటపడింది. ఆవు పేడ విలువ దాదాపు రూ.1.25 లక్షలు ఉంటుందని అధికారులు తెలిపారు. ఆవు పేడను స్వాధీనం చేసుకున్న పోలీసులు సూపర్‌వైజర్‌ని అదుపులోకి తీసుకున్నారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు