చిన్నమ్మ, మామలు చేసే పాడు పని చూడలేక చనిపోతున్నా...

శనివారం, 28 అక్టోబరు 2017 (09:52 IST)
సాధారణంగా పిల్లలు తప్పు చేస్తే పెద్దలు మందలిస్తుంటారు. అదే పెద్దలు తప్పు చేస్తే పిల్లలు ఏం చేయలేని నిస్సహాయ స్థితిలో ఉంటారు. వరుసకు చిన్నమ్మ, మామల మధ్య ఏర్పడిన వివాహేతర సంబంధాన్ని కనులారా చూసిన ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన ఒకటి కర్ణాటక రాష్ట్రంలో జరిగింది. ఈ వివరాలను పరిశీలిస్తే... 
 
మైసూరు తాలూకాలోని డి.సాలుండి గ్రామానికి చెందిన నవీన్‌ నాయక్‌ (19) చిన్నమ్మ, మామ గత కొంత కాలంగా వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నారు. వారిద్దరు సన్నిహితంగా ఉండటాన్ని నవీన్ నాయక్ చూశాడు. పైగా వారిద్దరిని కూడా మందలించాడు. 
 
దాంతో వారు నవీన్‌ను వేధించడం మొదలు పెట్టారు. వాళ్ల వేధింపులు భరించలేక నవీన్‌ నాయక్‌ వారి వివాహేతర సంబంధం గురించి, ప్రశ్నించినందుకు తనపై వారి వేధింపుల గురించి సుమారు ఆరు పేజీల డెత్‌ నోటు రాసి దాన్ని తన ఫేస్‌బుక్‌ అకౌంట్‌లో పోస్ట్‌ చేసి ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. 
 
దయచేసి చర్యలు తీసుకోవాలని ఆ డెత్‌ నోటులో పోలీసులను వేడుకున్నాడు. బుధవారం నవీన్‌నాయక్‌ మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహించడానికి బంధువులు తీసుకుని వెళ్తుండగా జయనగర పోలీసులు అక్కడికి చేరుకుని జరిగిన విషయాన్ని తెలిపి మృతదేహాన్ని శవ పరీక్షకు తరలించి దర్యాప్తు చేపట్టారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు