దీనిపై బ్యాదరహల్లి పోలీసులు వెల్లడించిన వివరాలన మేరకు.. సునంద (50) అనే మహిళా ఉపాధ్యాయురాలు బుధవారం మధ్యాహ్నం తరగతి గదిలోని విద్యార్థులకు పాఠం చెబుతుండగా రేణుకారాధ్య అనే వ్యక్తి తరగతి గదిలోకి చొరబడి పెట్రోల్ పోసి నిప్పంటించి పరారయ్యాడు. విద్యార్థులు, టీచర్లు, ఇతర సిబ్బంది వేగంగా స్పందించి, మంటలు ఆర్పేసి, హుటాహుటీన ఆసుపత్రిలో చేర్చారు.
ఆమెకు వైద్య చికిత్స అందిస్తున్న సుకందకట్టె ప్రభుత్వాసుపత్రి వైద్యులు మాట్లాడుతూ... ఆమెకు 50 శాతం గాయాలయ్యాయని, ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగా ఉందని, వెంటిలేటర్‌పై ఉంచి ఆమెకు చికిత్స అందిస్తున్నామని అన్నారు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు, దర్యాప్తు ప్రారంభించారు.